trending

రూ.406 కోట్లు: దసరాకు జోరుగా మద్యం విక్రయాలు, గతేడాది కంటే పెరిగిన లిక్కర్ సేల్స్..

దసరా.. తెలంగాణలో పెద్ద పండుగ. అమ్మవారికి పూజ చేసి, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా మద్యం సేవిస్తారు. అయితే ప్రతీసారి దసరా రికార్డుల్లో మద్యం విక్రయాలు జరుగుతుంటాయి. దసరా.. అంతకుముందు రోజుల్లో భారీగా సేల్స్ ఉంటాయి. అయితే కరోనా వైరస్, మాంద్యం నేపథ్యంలో మద్యం విక్రయాలు ఎలా ఉంటాయని అంచనాలు ఉన్నా.. ఈ సారి కూడా రికార్డ్ సేల్స్ జరిగాయి. దసరా.. అంతకుముందు రోజుల్లో రూ.406 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. రూ.406 కోట్ల మద్యం దసరా సందర్భంగా మద్యం డిపోల నుంచి రూ.406 కోట్ల మందును తరలించారు. వైన్ షాపులలో మద్యం స్టోర్ చేశారు. అయితే 22వ తేదీన శుక్రవారం రోజున రూ.131 కోట్ల విలువైన మద్యాన్ని విక్రయించారు. శనివారం రోజున రూ.175 కోట్ల లిక్కర్ విక్రయాలు జరిగాయి. అంతకుముందు రోజు స్టాక్ తీసుకురావడంతో.. దసరా రోజున రూ.100 కోట్ల లిక్కర్ విక్రయాలు జరిగాయి. 4.71 లక్షల కేసుల లిక్కర్ 4.71 లక్షల కేసుల మద్యం (విస్కీ, బ్రాండీ, ర...

బ్యాట్ కొనలేని పేదరికం.. రాత్రి 3 గంటల వరకు పని చేసి స్కూల్‌కు.. వార్నర్ ప్రస్థానం ఇదీ!

కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఇప్పుడో స్టార్ క్రికెటర్. కానీ చిన్నతనంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. బ్యాట్ కొనే స్థోమత కూడా లేని కుటుంబంలో పెరిగిన వార్నర్.. ఈ స్థాయికి చేరుకున్నాడు. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పుట్టిన రోజు నేడు (అక్టోబర్ 27). ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న వార్నర్.. అద్భుత ఆటతీరుతో.. అంతకు మించిన వ్యక్తిత్తంతో మనలో ఒకడిలా కలిసిపోయాడు. టాలీవుడ్ పాటలకు స్టెప్పులేస్తూ.. సినీ అభిమానులకు సైతం వార్నర్ దగ్గరయ్యాడు. ఐపీఎల్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డ్ సొంతం చేసుకున్న వార్నర్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 5000కిపైగా పరుగులు చేసిన తొలి విదేశీ ఆటగాడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు.

ప్రగతీ భవన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు

ప్రగతి భవన్‌లో పోలీసులు భారీగా మోహరించారు. బండి సంజయ్ అరెస్ట్‌కు నిరసనగా ఇవాళ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగుతున్నారు. రఘునందన్ బంధువుల ఇళ్లలో హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ నివాసమైన ప్రగతి భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సోమవారం రాత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై పోలీసుల దాడికి నిరసనగా నేడు చలో ప్రగతి భవన్‌కు ఏబీవీపీ, బీజేవైఎం పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ నేపథ్యంలో వందల సంఖ్యలో బలగాలు ప్రగతి భవన్ పరిసరాల్లో మోహరించాయి. అటు తెలంగాణ భవన్ వద్ద కూడా పోలీసులు సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.

‘ఎత్తుపళ్లాలు సహజం.. గేమ్‌ప్లాన్‌ అమలు చేశా’

అబుదాబి: ‘‘నన్ను నేను నమ్ముతాను. నిజానికి 14 మ్యాచ్‌లు ఆడినప్పుడు కొన్ని ఎత్తుపళ్లాలు చవిచూడకతప్పదు. పెద్ద మైదానాల్లో, విభిన్న రకాల వికెట్ల మీద ఆడేటప్పుడు షాట్‌ సెలక్షన్‌ కోసం కాస్త ఎక్కువ సమయమే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ గేమ్‌ప్లాన్‌ను నేను పక్కాగా అమలు చేశాను. అదే ఈనాటి మ్యాచ్‌లో నన్ను కొత్తగా నిలబెట్టింది. ఎన్ని పరుగులు చేస్తున్నాం.. స్ట్రైక్‌రేట్‌ ఎంత ఉంది అన్న విషయాలపై నేను దృష్టిపెట్టలేదు. ప్రతీ బాల్‌ను ఎలా ఎదుర్కోవాలన్న అంశం మీద ఫోకస్‌ చేశాను. అవకాశం వచ్చిన ప్రతిసారి బంతిని బలంగా హిట్‌ చేశాను. అలా కుదరని సమయాల్లో సింగిల్స్‌, డబుల్స్‌ తీయడానికి ప్రాధాన్యం ఇచ్చాను’’ అంటూ రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు సంజూ శాంసన్‌ తన ఆటతీరు పట్ల సంతృప్తికరంగా ఉన్నట్లు వెల్లడించాడు. సింపుల్‌ గేమ్‌ప్లాన్‌ను అమలు చేసి లక్ష్యాన్ని పూర్తిచేసినట్లు పేర్కొన్నాడు. (చదవండి: సంజూ గ్రేట్‌.. పంత్‌ నువ్వు హల్వా, పూరీ తిన...

కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణంపై సీఎం జగన్‌ సమీక్ష

సాక్షి, అమరావతి: కడప స్టీల్‌ప్లాంట్‌ ప్రయత్నాలు ముమ్మరం చేయాలని, వీలైనంత త్వరగా కంపెనీ ఎంపిక పూర్తి కావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కొప్పర్తి ఈఎంసీ ద్వారా 30వేల మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యమని ఆయన అన్నారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం, కొప్పర్తి ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌పై అధికారులతో ముఖ్యమంత్రి సోమవారం క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, ఇండస్ట్రియల్‌ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవన్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి 7 ప్రఖ్యాత కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. వాటితో జరిపిన సంప్రదింపుల పురోగతిని సీఎంకు వివరించారు. స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణంపై ఆయా కంపెనీల ప్రతిపాదనలు స్వీకరించి తదుపరి ఒక సంస్థ...

బ్రేక్‌లో ఒక ప్లేయర్‌ను మిస్సయ్యాం..!

దుబాయ్‌: ఆర్సీబీతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 8 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది.  రుతురాజ్‌ గైక్వాడ్‌  51 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో అజేయంగా 65 పరుగులు సాధించి సీఎస్‌కే విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆర్సీబీ నిర్దేశించిన 146 పరుగుల టార్గెట్‌లో రుతురాజ్‌-ధోనిలు బాధ్యతాయుతంగా ఆడటంతో సీఎస్‌కే 18.4 ఓవర్లలో 150 పరుగులు చేసి విజయం సాధించింది. ధోని  21 బంతుల్లో 3 ఫోర్లతో అజేయంగా 19 పరుగులు చేశాడు.  రాయుడు 27 బంతుల్లో 3 ఫోర్లు,  2 సిక్స్‌లతో 39 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.  (ఆర్చర్‌ ఆరేళ్ల క్రితం మాట.. ఇప్పుడెలా సాధ్యం?) కాగా, మ్యాచ్‌ జరిగేటప్పుడు టైమ్‌ ఔట్‌ సెషన్‌లో అంబటి రాయుడు ఫీల్డ్‌ను విడిచి బాత్రూమ్‌కు వెళ్లిన క్రమంలో గేమ్‌ చాలాసేపు ఆగిపోయింది. 2నిమిషాల 30 సెకన్ల బ్రేక్‌ పూర్తైన తర్వాత ఆటగాళ్లంతా ఎవరి స్థానాల్లో వారు వచ్చేస్తే, క్రీజ్‌లోకి రావాల్సిన ఉన్న రాయుడు కనిపించలేదు. దాంత...

telugu

రుణ కస్టమర్లకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. మారటోరియం కాలంలో అన్ని రుణాలపై చక్రవడ్డీకి బదులు సాధారణ వడ్డీయే వసూలు చేస్తామని, వడ్డీపై వడ్డీని వెనక్కు ఇస్తామని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం సమర్పించిన అవిడఫిట్‌లో పేర్కొన్న దిశగా చర్యలు చేపట్టింది. మారటోరియం అమలైన ఆరు నెలల కాలంలో ఈఎంఐలను చెల్లించిన వారికి చక్రవడ్డీ, సాధారణ వడ్డీల మధ్య వ్యత్యాసాన్ని నవంబర్‌ 5లోగా రుణగ్రహీతల ఖాతాల్లో జమచేయనున్నారు.