ఫీచర్ చేయబడింది

బిస్కెట్‌ రుచి చూస్తే చాలు.. భారీగా వేతనం

లండన్‌: నెలకు మూడు లక్షల రూపాయలకు పైగా జీతం.. ఏడాదికి 35 సెలవులు.. ఇవి కాక బోనస్‌లు, ఇంక్రిమెంట్లు. ఆఫర్‌ టెంప్టింగ్‌గా ఉంది.. పని ఎంత కష్టమో అనుకుంటున్నారా. అది మరీ సులభం. కేవలం బిస్కెట్లు టేస్ట్‌ చేసి.. ఫీడ్‌ బ్యాక్‌ ఇవ్వాలి. ఇందుకు గాను ఏడాదికి అక్షరాల 38 లక్షల రూపాయల జీతం చెల్లించేందుకు సిద్ధం అంటూ ఓ కంపెనీ ప్రకటన ఇచ్చింది. ఇంకేముంది కుప్పల్లో అప్లికేషన్లు వచ్చి పడుతున్నాయట. కంపెనీ అడ్రెస్‌ ఇవ్వండి మేం కూడా అప్లై చేస్తాం అంటారా వెయిట్‌. ఇది మన దగ్గర కాదు. యూకేకు చెందిన స్కాటిష్ బిస్కెట్ సంస్థ బోర్డర్ బిస్కెట్స్ ఒక కొత్త ఉద్యోగాన్ని సృష్టించింది. అదే బిస్కెట్ రుచి చూసే పని. ఇందుకోసం ప్రత్యేకంగా నియమించిన మాస్టర్లకు బిస్కెట్ రుచి చూసినందుకు గాను సంవత్సరానికి 40 వేల పౌండ్లు చెల్లించనున్నారు. మన రూపాయిల్లో చెప్పాలంటే దీని విలువ సుమారు 40 లక్షలుగా ఉండనుంది. అంటే నెలవారీగా 3 లక్షల రూపాయలకు ప...