Share This Post

Sports News

బ్యాట్ కొనలేని పేదరికం.. రాత్రి 3 గంటల వరకు పని చేసి స్కూల్‌కు.. వార్నర్ ప్రస్థానం ఇదీ!

బ్యాట్ కొనలేని పేదరికం.. రాత్రి 3 గంటల వరకు పని చేసి స్కూల్‌కు.. వార్నర్ ప్రస్థానం ఇదీ!

కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఇప్పుడో స్టార్ క్రికెటర్. కానీ చిన్నతనంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. బ్యాట్ కొనే స్థోమత కూడా లేని కుటుంబంలో పెరిగిన వార్నర్.. ఈ స్థాయికి చేరుకున్నాడు.

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పుట్టిన రోజు నేడు (అక్టోబర్ 27). ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న వార్నర్.. అద్భుత ఆటతీరుతో.. అంతకు మించిన వ్యక్తిత్తంతో మనలో ఒకడిలా కలిసిపోయాడు. టాలీవుడ్ పాటలకు స్టెప్పులేస్తూ.. సినీ అభిమానులకు సైతం వార్నర్ దగ్గరయ్యాడు. ఐపీఎల్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డ్ సొంతం చేసుకున్న వార్నర్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 5000కిపైగా పరుగులు చేసిన తొలి విదేశీ ఆటగాడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు.

Share This Post